ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మందులు పంపిణీ

తూ .గో ;ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది వలసకూలీలు మరియు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, మందులను నవఖండవాడ, పిఠాపురం, గొల్లప్రోలులో ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం వచ్చి లాక్ డౌన్ వలన చిక్కుకున్న కార్మికలకు మరియు వలస కూలీలకు నిరుపేద రోజువారీ కూలీలకు వివిధ రకాల కూరగాయలు, బియ్యమును అందించటం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వాలంటీర్లు సహకారముతో 15 లక్షల మందికి పైగా కరోనా వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేసి, వ్యాధిపట్ల అవగాహన కల్పించడము జరిగిందన్నారు. రానున్న రోజులలో ఇంకా విస్త్రృతముగా ఉచిత మందుల పంపిణీ మరియు వ్యాధిపట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేస్తున్నట్టు తెలియజేసారు. కుట్టులో అనుభవము ఉన్న ట్రస్ట్ వాలంటీర్స్ మరియు ట్రస్ట్ తరుపున కుట్టులో శిక్షణ పొంది వారి ద్వారా మాస్కులు తయారు చేయించి ఆ తయారైన మాస్కులను ఆయా ప్రాంతాలలో గల వైద్య, పోలీస్, రెవిన్యూ మరయు పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేయుచున్నామని అన్నారు. ఇప్పటి వరకు పదివేల మాస్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. “స్వీయ నిర్భందం శిక్షకాదు, అదే మనకు రక్ష” అని ప్రతి ఒక్కరు మన ప్రభుత్వము వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ పరిసరాలను శుభ్రముగా ఉంచుకుంటూ, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని ట్రస్ట్ కార్యకర్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు రేకా ప్రకాష్, కురందాసు ఉమేష్, శెశెట్టి రాంబాబు, శెశెట్టి సాయికుమార్, గొల్లపల్లి శివ, సన్నిబోయిన ఉమ, సన్నిబోయిన వెంకటరెడ్డి, పంచదార్ల మురళీ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు