మహిళల సంక్షేమమే వైకాపా లక్ష్యం;; పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం'.... యమ్ ఎల్ ఎ పర్వత ప్రసాద్
తూ.గో ;శంఖవరం, అక్షర లీడర్: ఒక ప్రక్క కరోనా వైరస్ తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచి పోయినా,కేద్రం నుండి వచ్చే నిధులు తగ్గినా ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు వెనుకడుగు వేయకుండా పొదుపు సంఘాల అక్కాచెల్లెళ్ళకు సున్నా వడ్డీ లకే ఋణాలు మంజూరు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, మహిళల సంక్షేమం కోసం నిరంతరం పోరాడేది వైకాపా ప్రభుత్వం అని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పర్వత ప్రసాద్ అన్నారు.స్ధానిక మండల అభివృద్ధి కార్యాలయంలో వెలుగు ఎ పి యమ్ కూరగాయల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సున్నా వడ్డీ పధకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు శాశన సభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని, దీని ద్వారా పొదుపు సంఘాల ఖాతాలో సిఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతలో సొమ్ము జమ కాబడుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన్నే నిలుస్తోందని, కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పేదలను ఆదుకోనేందుకు ఉచిత బియ్యం,కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించారని,ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నదేనని ఆయన అన్నారు. అనంతరం 4 మండలాలలోని 5024 గ్రూపులకు గాను 3 కోట్ల 60 లక్షల చెక్ ను స్వయం సహాయక సంఘాలకు యమ్ ఎల్ ఎ పర్వత చేతుల మీదుగా అందించారు.ముఖ్యమంత్రి ఈ వడ్డీ భారం పేద అక్కా చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారమే ఈ సున్నా వడ్డీ మొత్తాన్ని గ్రూపు యొక్క అప్పు ఖాతాకు జమ చేయడం జరుగుతుందని, అలాగే ప్రతీ సంఘం సక్రమంగా అప్పులు చెల్లించాలని సూచించారు.
కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా అందరూ భౌతిక దూరం పాటించాలని , మాస్క్ లను తప్పని సరిగా ఉపయోగించాలని తెలియజేస్తూ స్వయం సహాయక సంఘాల ద్వారా సుమారుగా 15 లక్షల 50వేల మాస్క్ లను కుట్టించి ప్రతీ ఒక్కరికీ 3 మాస్క్ ల చొప్పున ఉచితంగా పంపిణి చేయదలచి మాస్కు లను కూడా లాంఛనంగా వారు అందజేశారు. వై.యస్. ఆర్ భీమా పధకం క్రింద 18 మంది లబ్ధిదారులకు గాను 33 లక్షల 35వేల చెక్ లను యం.ఎల్.ఎ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓలు జె.రాంబాబు, యస్.వి.నాయుడు మరియు వై.యస్.ఆర్. క్రాంతి పధం సిబ్బంది పాల్గొన్నారు.
REPORTER....GOVIND
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి