ఎలక్ట్రికల్ కార్మికులకు ఏ ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ

తూ.గో.జిల్లా. కరోన వైరస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పగలనక రాత్రనక తేడా లేకుండా కష్టపడి మండుటెండలో సైతం ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులలో నేనున్నానంటూ ఐ పోలవరం ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీనుబాబు ఆర్థిక సహాయంతో తమ మండలం లో పనిచేసే ప్రైవేటు విద్యుత్ కార్మికులకు తనవంతు సాయంగా సుమారు 30 మందికి నిత్యవసర వస్తువులు ముమ్మిడివరం ఏ డి ఏసుబాబు చేతులమీదుగా అమలాపురం ఈ ఈ. సాల్మన్ రాజు ఆదేశాల మేరకు మురమళ్ళ ఎలక్ట్రికల్ ఆఫీసు వద్ద అందజేశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు