హెల్త్ సర్వైలెన్స్ మరింత పటిష్టం ;తూ .గో కలెక్టర్
జిల్లాలో నాలుగు కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైన నేపద్యంలో హెల్త్ సర్వైలెన్స్ మరింత పటిష్టం చేసామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి తెలియజేసారు. మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 4 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒకరు విదేశాల నుండి వచ్చిన వ్యక్తని, మిగిలిన ముగ్గురు డిల్లీలో మత పరమైన సమావేశానికి హాజరై జిల్లాకు తిరిగి వచ్చిన వారని తెలిపారు. డిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు వచ్చిన 26 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించామని, 23 నమూనాలకు నెగిటీవ్ రాగా, 3 కేసులలో మాత్రం వైరస్ పాజిటీవ్ అని తేలిందన్నారు. పాజిటీవ్ కేసులతో కాంటాక్ట్ కలిగిన వ్యక్తులను కూడా హోమ్ ఐసోలేషన్ క్రింద పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ సందర్భంగా జిల్లాల్లో నిత్యావసర సరుకుల సరఫరా, ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చౌకధరల దుకాణాలు, పింఛను పంపిణీ ప్రదేశాలలో ప్రజలు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించేట్లు చూడాలని సూచించారు. వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులకు గురికాకుండా వసతి, ఆహారం కల్పించాలని కోరారు. కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిన నేపద్యంలో సర్వైలెన్ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఆమె మార్గదర్శకాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బి.రాజ శేఖర్, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి.రాకుమారి, వైద్య అధి కారులు పాల్గొన్నారు. (సమాచార శాఖచే జారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి