కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు
తూ.గో ;;జిల్లాలో కరీనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయం నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ల తో కోవిద్ 19 పై చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కోవిద్ 19 ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే తో కలిసి కలెక్టర్ డి. మురళీధరెడ్డి లు జిల్లా అధికారులు వివిధ వైద్య విభాగాల వైద్యుల తో కలిసి అయినా కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి. మురళీధరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఒక కేసును డిచ్చార్జీ చేయడం జరిగిందన్నారు. పాజిటివ్ కేసులు ఉన్న వారు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పెద్దాపురం, కొత్తపేట, పిఠాపురం, కత్తిపూడి, అమలాపురం ఐదు ప్రాంతాలను కంటోన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గుర్తించిన అనుమానితులను జిల్లాలో నిర్దేశించిన వివిధ కారం టైం సెంటర్లో ఉంచడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఉంచే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఓ నిశాంత్ కుమార్ ,రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్ కిషోర్, జేసి 2 జి. రాజకుమారి. డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు. కాకినాడ జిజిహెచ్ సూపర్నెంట్ ఎం. రాఘవేంద్రరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ బి. సత్య సుశీల, డి సి హెచ్ రమ పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి