
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ స్వగృహలో నివాసం ఉంటున్న ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు ఒక కొడుకు, కుమార్తె పూజ అంబికా(21) సంతానం. దంపతులిద్దరూ టైలరింగ్ చేసుకుని జీవిస్తుండగా కూతురు అంబికా బీటెక్ విద్యనభ్యసిస్తోంది. ఓ వైపు చదువుకుంటూనే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.సడెన్‌గా ఈ రోజు ఉదయం అంబికా తాను నివాసం ఉంటున్న రాజీవ్ స్వగృహలోని తన అపార్ట్ మెంట్ పై నుంచి పడి చనిపోయింది. ఉదయం అయిదున్నర గంటలకు వాకింగ్‌కి వెళ్లే సమయంలో ఒక్కసారిగా యువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి చనిపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు షాక్‌కు గురయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.యువతి మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అంబికా అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా తోసేసి హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి