కరోనా ఎఫెక్ట్,; గంగా నది ప్రక్షాళన

*వందల కోట్లు ఖర్చు పెట్టినా కానిది ఒక్క కరోనా వైరస్ తో ప్రక్షాళన.*
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రిషికేష్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల వద్ద గంగానది ఉండటం అక్కడకు లక్షలలో వచ్చే భక్తులు ఇష్టానుసారంగా వ్యర్ధాలు పడేయడం, ఇక గంగానది వెంట అనుకోని ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు నదిలో కలిపేయడంతో గంగానది విషపూరితంగా మారింది. గంగానది ప్రక్షాళన కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కానిది ఒక్క కరోనా వైరస్ వలన జరగడంతో పర్యావరణ నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


కరోనా వైరస్ వలన అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో పాటు భక్తుల రాక కూడా పూర్తిగా నిలిచిపోవడంతో గంగానది మంచి నీళ్లు తాగే అంత పరిశుభ్రంగా మారడమే కాకుండా నది లోపల ఉండే చేపలు స్పష్టంగా కనపడేంత స్వచంగా నదీజలాలు పరిశుభ్రమయ్యాయి.
హరిద్వార్ వద్ద గంగా నది నీటి పీహెచ్ శాతం అదుపులోకి వచ్చిందని తాజాగా ఇక్కడి నీటిని పర్యావరణ విభాగం 'క్లాస్ ఏ' విభాగంలో చేర్చింది. 'క్లాస్ ఏ' లో ఉండే నీటి పీహెచ్ శాతం 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ప్రస్తుతం గంగా నదీ జలాల పీహెచ్ శాతం 7.4 గా ఉన్నట్టు పర్యావరణ విభాగం పేర్కొంది.


కరోనా వైరస్ మానవాళికి ఎంతో ముప్పు వాటిల్లేలా చేస్తున్న పర్యావరణాన్ని మాత్రం వ్యర్ధాల నుంచి పరిశుభ్రంగా మార్చడంలో సహాయ పడుతుంది. ఇప్పటికైనా ప్రక్షాళన అయిన గంగ నదిని కాపాడుకుంటారో లేక కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత గాలికి వదిలేస్తారా చూడాలి.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు