మూసివేసిన 'అన్న క్యాంటీన్ల' వెంటనే తెరవాలని, ధాన్యం, అపరాలు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రతీ పేద కుటుంబానికిరూ. 5000/- ఆర్ధిక సాయం అందిచాలని, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, యితర అధికారులకు రక్షణ కిట్ లను అందిచాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సామాజిక దూరం పాటిస్తూ బుధవారం కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు 12 గంటల నిరాహారదీక్ష కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోకుండా కరోనా వైరస్ కట్టడిలో విఫలం చెందిందని, కేంద్ర ప్రభుత్వం అందించిన 1000/- నగదు మరియు నిత్యావసర సరుకులు పంపిణీలో కూడా వైఫల్యం చెందారని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో కరోనా వైరస్ నిర్మూలనకు పకడ్బందీ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్మూలన కంటే స్థానిక సంస్థల ఎన్నికలు విషయంలోనే ఎక్కువ దృష్టి సారిస్తుందని మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలు అనేకమంది ఇతర రాష్ట్రాలలో చిక్కుకు పోయారని ఆకలితో అలమటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తోందని ప్రస్తుత సమయంలో అన్నా క్యాంటీన్లు తెరిచి ఉంటే ప్రతి పేదవాడు ఆకలి లేకుండా ఉండేవారిని, వ్యవసాయం పౌల్ట్రీ ఆక్వా రంగాలను పట్టించుకోకుండా ప్రచారానికే పరిమితం అయిందని, ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ప్రతి పేదవాడి కుటుంబానికి 5,000/- ఆర్థిక సహాయం అందించాలని ఖ్న్నారు .దీక్ష కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు పసగడుగుల శేషగిరిరావు, వాసంశెట్టి చిటప, చింతలపూడి రవి, పోలిపల్లి జగన్, గుమ్మల చిన్న తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి