మానవత్వం పరిమళించింది ;;;మతిస్థిమితం లేని మహిళ ;;ఆదుకున్న జాన్ మోజేష్ టీం
తూ .గో ;రోడ్లపై జనసంచారం లేదు... అయ్యో ఆ తల్లి ఏమై నా తిన్నాధో లేదో ... ఏవమ్మా ఏమైనా తిన్నావా ఆంటే దిక్కులు చూసింది... తరువాత అర్థమైనది .. ఆమెకు మతిస్థిమితం లేదని... కానీ ఆమె ఒరిస్సాకు చెందింది ..ఎలా వచ్చిందో పాపం ... వెంటనే ఆదుకున్నారు ...చలించి పోయారు .... ఎవరూ ... సామర్లకోట లో 6వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ఉబా.జాన్ మోజేష్ వారి యొక్క టీం... అసలు వారు బ్రౌన్ పేట నుండి స్థానిక సి. బి. మ్. సెంటర్ వరకు గస్తీ కాస్తుండగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మతి స్థిమితం లేని ఒక మహిళ ఆటు, ఇటు తిరుగు చుండగా ఆవిడ తో మాట్లాడి భోజనం ఏర్పాటు చేసి సామర్లకోట పోలీస్ వారితో మాట్లాడి అంబులెన్సు ఏర్పాటుచేసి పెద్దాపురం లో ఉన్న షెల్టర్ కు పోలీస్ వారి సహాయం తో పంపించారు.అప్పటి వరకు వారిలో ఆవేదన ..తమ తల్లిలా భావించారు... పోలీసులు వచ్చి షెల్టర్ కు తీసుకు వెళ్లేంత వరకు వారి మనసు కుదురు లేదు... ఈ కార్యక్రమం లో క్రిస్టియన్ మైనారిటీ సెల్ కన్వీనర్ సల్లూరి. కళ్యాణ్, మగాపు. గోపి, పాలిక. చంటిబాబు, బొడ్డు. ఆంథోనీ, లాజర్ పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి