కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా ట్రస్ట్ విరాళాలు
తూ.గో; కరోనా నియంత్రణకు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమములు కరోనా నియంత్రణకు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మరియు ఇతర రాష్ట్రములలో పలు కార్యక్రమములు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ డా|| ఉమిలీషా అన్నారు. దానిలో భాగముగా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షరూపాయలు మొత్తము మూడు లక్షల రూపాయలు విరాళముగా ఇచ్చినట్లు తెలియజేసారు. ట్రస్ట్ వాలంటీర్లు సహకారముతో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేసి, వ్యాధిపట్ల అవగాహన కల్పించడము జరిగిందన్నారు. రానున్న రోజులలో ఇంకా విస్త్రృతముగా ఉచిత మందుల పంపిణీ మరియు వ్యాధిపట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేస్తున్నట్టు తెలియజేసారు. కుట్టులో అనుభవము ఉన్న ట్రస్ట్ వాలంటీర్స్ మరియు ట్రస్ట్ తరుపున కుట్టులో శిక్షణ పొంది వారి ద్వారా మాస్కులు తయారు చేయించి ఆ తయారైన మాస్కులను ఆయా ప్రాంతాలలో గల , వైద్య, పోలీస్, రెవిన్యూ మరయు పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేయుచున్నామని అన్నారు. ఇప్పటి వరకు పదివేల మాస్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. “స్వీయ నిర్బందం శిక్షకాదు, అదే మనకు రక్ష” అని ప్రతి ఒక్కరు మన ప్రభుత్వము వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ పరిసరాలను శుభ్రముగా ఉంచుకుంటూ, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, వారు ప్రజలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన ఒక లక్ష రూపాయలు చెక్ ను వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబుకు అందచేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి