కత్తిపూడి లో కరోనా పాజిటివ్... హుటాహుటిన చేరుకున్న వైద్య బృందం.. రెడ్ జోన్ గా కత్తిపూడి గ్రామం...


శంఖవరం,(తూ.గో);   ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామంలో కలకలం రేపింది.. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఉగాది రోజున కత్తిపూడి గ్రామంలో గల అత్త వారింటికి కుటుంబ సభ్యులు తో వచ్చాడు. గత కొద్దికాలం లో జ్వరం రావడం తో స్ధానిక మెడికల్ షాప్ వద్ద టాబ్లెట్ వేసుకున్నాడు.అయినా జ్వరం తగ్గక పోవడంతో నిన్న కాకినాడ జిజిహెచ్ కు వైద్య పరీక్షలు నిమిత్తం వెళ్ళగా అతనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో గురువారం ఉదయం జిల్లా వైద్య శాఖాధికారి సత్త సుశీల తన బృందంతో కత్తిపూడి చేరుకుని ఆ వ్యక్తి నివశిస్తున్న పరిసరాల్లో గల అందరినీ సుమారు 38 మంది నుండి నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు కోసం పంపించారు. అందరకీ ట్యాగ్ వేసి హోం క్వారెంటైన్ లో ఉండమని ఆదేశాలు జారీ చేస్తూ, కత్తిపూడి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.ఈ విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పర్వత ప్రసాద్ కరోనా కేసు నమోదిత స్ధలానికి చేరుకుని అక్కడ పరిస్థితులు ను తెలుసుకుని కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యం కు మెరుగైన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. ఆర్ డి ఓ మల్లిబాబు మాట్లాడుతూ కత్తిపూడి గ్రామ ప్రజలందరూ 15 రోజుల పాటు ఎవరింటికి వాళ్ళే పరిమితం కావాలని నిత్యావసర వస్తువులు పంపిణికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి యస్ పి అరిటాకుల శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు