ప్రమాదవశాత్తు మరణించిన ఏ ఆర్ ఎస్ ఐ బార్యకు చెక్కుఅందజేత
తూ .గో ;ఇటీవల అనగా 04.09.2019 వ తేదీన ప్రమాదవశాత్తు మరణించిన ఏ ఆర్ ఎస్ ఐ 835 చాగంటి సత్య సూర్య చంద్రశేఖర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ శాఖ నుండి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రాబడిన రూ. 30 లక్షల రూపాయల చెక్కును వారి భార్య అయిన చాగంటి సర్వలక్ష్మి కాకినాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రాజా రామ మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లా యస్.పి అద్నాన్ నయిం అస్మి చేతుల మీదుగా అందజేసినారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీ లన్నియు ఇదివరకే వచ్చాయని ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను యస్.పి ఆదేశించారు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఎకౌంట్ ఉన్న పోలీసు సిబ్బందికి ఈ పథకం ద్వారా ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేకుండా ఈ 30 లక్షల రూపాయల ప్రమాద భీమ ప్రీమియం చెల్లించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో ఎస్.పితోపాటు అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) కె.కుమార్, ఎస్.బి డి.ఎస్.పిలు ఎం.అంబికా ప్రసాద్, ఎస్ మురళీ మోహన్, ఎస్.బి సి.ఐ. ఎస్.రాంబాబు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి