జిల్లాలో నేల వాలిన 9,337 హెక్టార్ల వరి పంట
తూర్పు గోదావరి జిల్లాలో 1,65,138 హెక్టార్ల లో దాళ్వా పంట కాలంలో వరి సాగు జరిగింది. దీనిలో ప్రస్తుతము 97,345 హెక్టార్లలో కోతలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతము ఈ నెల 25 వ తారీఖున కురిసిన వర్షం మూలంగా జిల్లాలో 55 మండలాల్లో వర్షపాతం రికార్డు అయ్యింది. అత్యధికంగా కిర్లంపూడి మండలంలో 166. 2 మిల్లి మీటర్ల వర్ష పాఠం రికార్డు అయ్యింది. జిల్లాలో 9,337 హెక్టార్ల వరి పంట నేల వాలింది. 1378 హెక్టార్ల వరి పంట పనల పై వుంది. 883 హెక్టార్ల లోని వరి పంట కుప్పలపై వుంది. ఆలాగే 7191 హెక్టార్ల విస్తీర్ణం లోని వరి పంట కల్లాలలో వుంది. ప్రస్తుతము ఈ రోజు వాతావరణం క్లియర్ గా వున్న దృష్ట్యా, రైతులందరూ తమ తమ పొలాల్లోని నీటిని బయటకు పోయే విధముగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆలాగే నేలకొరిగిన పంటను వీలైనంత వరకు కట్టలుగా కట్టాలి. అలాగే వరి పనల మీద వున్న ప్రాంతాల్లో మొలక రాకుండా 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతము ఈనెల 27, 28మరియు 29 వ తారీఖున వర్ష సూచన ఉన్నందున రైతులు ధాన్యాన్ని వబ్బిడి చేసుకోవాలని తూర్పు గోదావరి సంయుక్త వ్యవసాయ సంచాలకులు కె యస్ వి ప్రసాద్ తెలియజేస్తున్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి