ఏపీలో కరోనా డేంజర్ బెల్స్:9కి పెరిగిన మరణాలు, ఆ ఒక్క జిల్లాలో 114 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే మరో 44 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 483కు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో గుంటూరు జిల్లాలో 5, అనంతపూరంలో 3, కడప జిల్లాలో రెండు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 483కి పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పోటాపోటీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కేసులు పెరిగి 114కు చేరుకున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సోకిన బాధితుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారుగా తెలుస్తోంది. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సైతం భారీగా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 114 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లా 91 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోనే 205 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 9 మరణాలు
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 483 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 9 మంది మరణించారు. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం 9 మంది మృతి చెందాడు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బాధితులు మొత్తం 16 మంది డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 458కి తగ్గిపోయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి