రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం . రాష్ట్రంలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు 8314 హెక్టార్లలో వివిధ రకాల పంట నష్టం జరిగింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు రూ.54 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల. ---వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్న బాబు.
రాష్ట్రంలో గడచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకుంటుందని, రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెస్సింగ్ శాఖా మంత్రి కురసాల కన్న బాబు తెలిపారు. సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప,వేములవాడ గ్రామాల్లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను,కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని మంత్రి కన్న బాబు వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద గడచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షానికి సుమారు 8314 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. పది రోజులు గడిస్తే రైతులు పడ్డ కష్టానికి ఫలితం చేతికొచ్చేదని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వరి 7,455.33 హెక్టార్లు, మొక్కజొన్న 539.90, నువ్వులు 270.20, వేరుశనగ 23.40 , ప్రొద్దు తిరుగుడు 5, మినుములు 0.80, పెసర 0.80, పొగాకు 19 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందులో ఎక్కువ శాతం వరి పంట నష్టం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో సుమారుగా 1.65 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా 2,266 హెక్టార్లలో వరి పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన పనిలేదని వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాటుపడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని నిలిపివేయడం జరిగిందని తెలిపారు. వర్షాల ప్రభావం కారణంగా చూపించి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి అదేశాలివ్వడం జరిగిందని తెలిపారు. రైతులు పండించిన బొండాలు రకం ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు. రైతులు పండించిన పంట పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే విధంగా జిల్లాలో 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రభుత్వం ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1835, ( 75 కేజీల బస్తాకు రూ.1376.25), సాధారణ రకం క్వింటా ధాన్యానికి రూ.1815, ( 75 కేజీల బస్తాకు రూ.1361.25 )చెల్లిస్తుందని, కాబట్టి రైతులందరూ తమ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతీ రైతు వివరాలు రిజిస్ట్రేషన్ చేసి,వారికి కూపన్ ఇవ్వాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముతారో తెలుసుకుని, ఆ వివరాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెలియజేయాలన్నారు. రైతు నష్టపోవడానికి వీలులేదని, వారి కష్టానికి ఫలితం దక్కాలని ముఖ్యమంత్రి ఖరీఫ్ సీజన్లో వర్షాలు, వరదలు కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రూ.54 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఒక వారం రోజుల్లో ఈ సొమ్ము రైతుల ఖాతాలో జమకావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కరప,వేములవాడ గ్రామాల్లో పంటనష్ట పోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ పర్యటనలో మంత్రి వెంట వ్యవసాయ శాఖ డిడి వి.టి రామారావు, ఏడిఏ పద్మ, ఏవో ఎ. గాయత్రి దేవి, కరప తహసిల్దార్ విజయ భాస్కర్, ఎంపీడీవో కె.స్వప్న, కాకినాడ రూరల్ సిఐ ఎ. మురళి కృష్ణ, కడప మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నాసుల సీతారామాంజనేయులు, గ్రామ వ్యవసాయ సహాయకులు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి