అకౌంట్లలో నేరుగా రూ.7500 వేయండి;;కేంద్రానికి మాజీ ప్రధాని మన్మోహన్ సూచన...

                                                                                                                                      కరోనా లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారని అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్‌ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ, ప్రధాన కిసాన్ పథకంలో ఉన్న వారికి రూ.7500 అందించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్యానెల్ సోమవారం నాడు మొదటిసారి సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సారథ్యంలో భేటీ అయిన ఈ ప్యానెల్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ముందున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇలు) రంగం పునరుద్ధరణ, పండిన పంటల సేకరణ, వలసదారుల సమస్యలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించింది. ఈ అంశాలపై త్వరలో వివరణాత్మకమైన ప్రణాళికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చెప్పారు. కోవిడ్ 19పై మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో ఏర్పడిన పార్టీ సంప్రదింపుల బృందం కేంద్ర ప్రభుత్వానికి తాము చేసిన సూచనలు తెలియజేస్తామని తెలిపారు.దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యం ఉన్న ఎంఎస్‌ఎంఇ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ నొక్కి చెప్పారన్నారు. చిన్న పరిశ్రమల పై మేము ఒక పటిష్టమైన పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించాం. ఒకటి, రెండు రోజుల్లో దాన్ని కేంద్రానికి ఇస్తాం. పంట సేకరణ, వలసదారుల సమస్యలపై కూడా ప్రభుత్వానికి సానుకూల సిఫార్సులు చేయాల్సిన అవసరం ఉందని మన్మోహన్‌సింగ్ చెప్పారని. కష్టాల్లో ఉన్న ఈ రంగాల వారికి దయగల, బాధ్యతాయుతమైన ప్రభుత్వం నిధులు సమకూర్చగలదని అనుకుంటున్నామని అని జైరాం రమేష్ వీడియో ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు