జిల్లాలో 7423 రాపిడ్ డయాగ్నిప్టిక్ టెస్టు కిట్ ల ద్వారా క్వారం టైం, రెడ్ జోన్లులో వున్నవారికి పరీక్షలు

. తూ . గో ;జిల్లాలో 7423 రాపిడ్ డయాగ్నిప్టిక్ టెస్టు కిట్ ల ద్వారా క్వారం టైం, రెడ్ జోన్లులో వున్నవారికి పరీక్షలు చేయనున్నట్లు జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలక్టర్ తన కార్యాలయపు సమావేశపు మందిరంలో వివిధ విభాగాల డాక్టర్లతో కోవిడ్-19 పై చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 7423 టెస్ట్ కిట్స్ వచ్చాయని, వీటిలో 4300 క్వారం టైమ్ సెంటర్లలో వున్నవారికి పరీక్షలు చేయనున్నారు. అదే విధంగా జ్వరంతో బాధ పడుతున్నవారికి 2123మంది, ఆరోగ్య కార్యకర్తలకు వేయి మందికి ఈ కిమ్ ద్వారా పరీక్షలు చేయనున్నారని కలక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ పరీక్షలు చేయడానికి డాక్టర్లలతో పాటు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి రెండు రకాల పరీక్షలు చేస్తారని, రెండు నెగిటీవ్ వస్తే పూర్తి ఆరోగ్యవంతంగా వున్నట్లు గుర్తించడం జరుగుతుందన్నారు. తొలిత ఒక వ్యక్తి నుండి రక్తం నమోనా తీసుకొని కోవిడ్ ఐజిఎమ, కోవిడ్ ఐజీజీ టెస్టులు చేస్తున్నామన్నారు. అనుమానిత వ్యక్తులు ఏ ఒక్క రైన తమకు ఈ పరీక్షలు కోరితే కాకినాడ జిల్లా కలక్టర్ కార్యాలయంలో ఏర్పటు చేసిన కోవిడ్-19 కాల్ సెంటర్ కు, టెలిహబ్ ఫోన్ ద్వారా సంప్రదించవచ్చనన్నారు. జిల్లాలో కోవిడ్-19 పై 17 డాక్టర్ల బృందాలు పనిచేస్తున్నాయన్నారు. క్వారం టైమ్ సెంటర్ల నిర్వహణ, శాంపిల్ సేకరణ, శాంపిల్ పరీక్షలు చేయడంతో పాటు టెలి హబ్, కాల్ సెంటర్ ద్వారా వచ్చే ఫోన్లుకు తగిన విధంగా స్పందించడం లాంటి పనులు జిల్లాలో సజావుగా జరుగుతుందని కలక్టర్ వివరించారు. ఆరోగ్య సేతు యాప్ ను 3000 కేసులు నమోదు అయ్యాయని, వీరిని ఫోన్ ద్వారా సంప్రదించి అవసరమైన చికిత్సలు అందించడం జరుగుతుందని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఐజిఎమ్, ఐజీజీ పరీక్షలు ఆరోగ్యశ్రీ కోఆర్డినేట్ డాక్టర్ మహిరత్న కిషోర్ కు రాపిడ్ యాక్షన్ పరీక్షలు అక్కడ అక్కడే నిర్వహించడం జరిగిందని పది నిముషాల తర్వత మహేష్ కు నేటిటీవ్ ఫలితాలు వచ్చాయని డాక్టర్లు పేర్కొన్నారని కలక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి-2 జి.రాజకుమారి, డిఎమ్ అండ్ హెచ్ ఓ డా.బి.సత్యసుశీల, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎన్.రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు