లాక్ డౌన్ ;;సందట్లో సారా తయారీ ... సంయుక్త దాడులు 7200 బెల్లం ఊట ధ్వంసం

తూ.గో;;ఐ పోలవరం.; కరోనా వైరస్ ప్రభావంతో ఒక ప్రక్క ప్రజలు లాక్ డౌన్ నుండి బయటకు రాకుండా అటు పోలీస్ ఇటు ఎక్సైజ్ వివిధ శాఖల వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉన్నారని ఇదే అదునుగా తీసుకుని ఐ.పోలవరం మండలం భైరవపాలెం బై పోచమ్మ కాలువ సమీపంలో అటు యానం పోలీసులు ఎటు ముమ్మిడివరం ఎక్సైజ్ సిఐ. నాగవల్లి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈసారి బట్టీల పై సంయుక్త దాడులు నిర్వహించారు. సుమారు 7200 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని సిఐ నాగవల్లి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నాగవల్లి మాట్లాడుతూ ఎవరైనా ఇటువంటి సారా బట్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే యానం నుండి ఆంధ్రాకుబొట్లు మీదుగా మద్యం తరలిస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈబోట్లు మీదుగా మద్యం తరలించిన వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు