ఢిల్లీలో కలకలం: పిజ్జా డోర్ డెలివరి బాయ్‌కు సోకిన కరోనా వైరస్ ;;: 72 కుటుంబాలు పరుగులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఓ ఘటన మరింత బీభత్సాన్ని సృష్టించింది. పిజ్జా డెలివరి బాయ్ కరోనా వైరస్ బారిన పడినట్లు వచ్చిన వార్తలు.. కొన్ని కుటుంబాలను భయాందోళనలకు గురి చేశాయి. ఆయా కుటుంబాల్లోని వారంతా క్వారంటైన్‌కు పరుగులు పెట్టాలే చేశాయి. ఆ ఉద్యోగితో పాటు అదే పిజ్జా ఔట్‌లెట్‌లో పని చేస్తోన్న 16 మందిని ఆసుపత్రికి తరలించారు. వారందరికీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి