కొత్త కేసుల్లో 65 శాతం మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవే!

 

గడచిన 24 గంటల్లో శుక్రవారం ఉదయం వరకు మొత్తం 485 కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 65 శాతం మంది తబ్లిగ్ జమాత్  ప్రతినిధులే ఉన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనవారిలో గురువారంమరో 295కి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో 141, మహారాష్ట్రలో 88, తమిళనాడులో 75, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నిజాముద్దీన్ మూలాలున్నవే. ఢిల్లీలో గురువారం నిర్ధారణ అయిన 129 కేసులు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో గురువారం నమోదయిన 143 కేసుల బాధితులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే.దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 65 శాతం మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవే!నిబంధనలను ఉల్లంఘించిన సామాజిక దూరం పాటించాలన్న సూచనను గాలికొదిలేయడమే తీవ్ర అనర్థం తెచ్చిపెట్టిందన్న నిజాముద్దీన్‌ మర్కజ్ ప్రార్థనల అనుభవంతోనైనా ప్రభుత్వాలు గుణపాఠం నే.





                                                                                                       దేశంలోకరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తుంటే దీనికి ఆజ్యం పోసేలా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు వ్యవహారం తోడయ్యింది. నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 1 నుంచి 15 రోజుల పాటు భారీయెత్తున నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారి వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లోనే 1,000పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక శాతం మర్కజ్ ప్రార్థనలకు హాజరైనవారివే.






                                                                                                       గడచిన 24 గంటల్లో శుక్రవారం ఉదయం వరకు మొత్తం 485 కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 65 శాతం మంది తబ్లిగ్ జమాత్  ప్రతినిధులే ఉన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనవారిలో గురువారంమరో 295కి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో 141, మహారాష్ట్రలో 88, తమిళనాడులో 75, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నిజాముద్దీన్ మూలాలున్నవే. ఢిల్లీలో గురువారం నిర్ధారణ అయిన 129 కేసులు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో గురువారం నమోదయిన 143 కేసుల బాధితులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే.

తమిళనాడులో 74, తెలంగాణలో 26, కర్ణాటకలో 11, ఏపీలో 32 కేసులు తబ్లీగ్ జమాత్‌కు వెళ్లొచ్చినవారే. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ నమోదైన కేసులకు దీంతో సంబంధం ఉంది. మార్చి 12న కరోనా వైరస్‌ను ‘మహమ్మారి’గా ప్రకటించిన సీఎం అరవింద కేజ్రీవాల్‌ ఢిల్లీలో 200 మందికి మించి ఒకచోట గుమిగూడరాదని మర్నాడు ఆంక్షలు విధించారు. ఆపై దాన్ని 50 మందికి పరిమితం చేశారు. ఆ నిషేధాజ్ఞల్ని తుంగలో తొక్కి తబ్లిగీ జమాత్‌ వేలమందితో సమావేశం ఎలా నిర్వహించింది..

                                                                                                           అందుకు లోపాయికారీగా ఎవరు సహకరించారన్న ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకడం లేదు. వేలాది మంది పౌరుల భద్రతను పణం పెట్టి మతపరమైన కార్యక్రమం నిర్వహించిన మౌలానా ముహమ్మద్‌ సాద్‌పై కేసు నమోదు చేయాలని కేజ్రీవాల్ ఆదేశించడంతో జమాత్‌ ముఖ్యనేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు