జిల్లాలో 62 మండలాలు, 12 మున్సిపాలిటీలు ప్రాంతాలలో ఉన్న 93,081 సంఘాలకు 9,65,763 మంది సభ్యులను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం ద్వారా లబ్ది

తూ .గో ;; జిల్లాలో 62 మండలాలు, 12 మున్సిపాలిటీలు ప్రాంతాలలో ఉన్న 93,081 సంఘాలకు 9,65,763 మంది సభ్యులను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చడం మహిళలకు ఎంతో ఉపసమనమని మధర్ ధేరిస్సా మహిళా సంక్షేమ నాయకురాలు సుగుణకుమారి అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జిల్లా నుండి కాకినాడ కలక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పిని పే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యులు వంగా గీతా, మార్గాని భరత్ కుమార్, కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి మహిళ సంఘాల ప్రతినిధులను సున్నా వడ్డీ పధకం పై మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రి సూచించారు. కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, మధర్ ధేరిస్సా సంఘం నాయకురాలను సుగుణకుమారి ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సుగుణకుమారి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కష్టకాలంలో వున్న మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పధకం ఈ రోజు నుండి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కరోనా వైరస్ వలన అష్ట కష్టాల్లో వున్న నిరు పేద కుటుంబాలను రెండు సార్లు రేషన్ ఇవ్వడం, వెయ్యి రూపాయలు నగదు రూపంలో చెల్లించడం మహిళల పట్ల మీరు చూపిస్తున్న ఆప్యాయతను మరవలేమన్నారు. వాలంటీర్లు వ్యవస్థ ద్వారా అవ్వ, తాతలకు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 8గంటలకు పింఛన్లు వారి గుమ్మం వద్దనే పింఛన్లు అందించడం మీ ప్రభుత్వ పనితనానికి నిదర్శనమని ముఖ్యమంత్రిని కొనియాడారు. వైఎస్ఆర్ పింఛన్ పధకం పై ప్రశంసలు కురిపించారు. దిశ చట్టం ద్వారా మహిళల గౌరవం పెంచి, దయనందిన జీవితంలో తమ పనులు సజావుగా చేసుకునే సౌభాగ్యం ముఖ్యమంత్రిగా మీరు కల్పించారని కొనియాడారు. ప్రతి పధకంలో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం దివంగనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జూలై 28 తేదీ పుట్టిన రోజున రాష్ట్రంలో 27 లక్షల ఇళ్ల పట్టా పంపిణీ శ్రీకారం చుట్టనున్నారని ప్రకటించడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా సుగుణకుమారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం, మహిళల పై మీకున్న అభిమానం మహిళా లోకం గుర్తించుకుంటుందని అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా నిరు పేద లైన తమ వంటివారికి తమ పిల్లల ఉన్నత చదువులు చదువుకునే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి అని సుగుణకుమారి తెలిపారు. నేనున్ననని అనే ధైర్యంతో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రికి మహిళా లోకం అంతా అండదండగా ఉంటామన్నారు. కోవిడ్-19 కష్టకాలంలో పనులు లేని సమయంలో మెప్మా, డిఆర్ డీఏ ద్వారా మాస్కులు కుట్టే పనులు కల్పించి, ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయూతకు ఋణపడియుంటామని, మధర్ ధేరిస్సా సంఘ సభ్యులు సుగుణకుమారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళ సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను సవినయంగా వివరించడం ఉపముఖ్యమంత్రి పిల్లి.సుభాష్ చంద్రబోస్, మంత్రి పిని పే.విశ్వరూప్, ఎమ్.పి లు, కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆమెను ప్రశంశించారు. ఈ సందర్బంగా కలక్టర్ మాట్లాడుతూ ఇటీవలే వంద రూపాయలకు నాలుగు రకాల పండ్లను ఒక ప్యాకెట్ గా తయారు చేసి వినియోగదారుల ఇంటికి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సూచించిన విధంగా కడియం పూల రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యాన్ని అమలు చేసే విధంగా పండ్ల కిట్లుతో పాటు పుష్పాలను కూడా ఉచితంగా అందించే కార్యక్రమం నేటి నుండి జిల్లాలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి.సుభాష్ చంద్రబోస్, మంత్రి పిని పే విశ్వరూప్, మహిళా ప్రతినిధులకు పండ్ల ప్యాకెట్లతో పాటు పుష్పాలను అందించారు. అదే విధంగా జిల్లాలో 12 మున్సిపాలిటీల లో 6490, ఎస్ హెచ్ జి గ్రూప్లు 4,68,580 మాస్కులు తయారుచేసి రెడ్ జోన్ ఏరియాకు పంపిణీ చేస్తున్నట్లు కలక్టర్ ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసారు. అనంతం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏఫ్రిల్, 2019 నుండి మార్చి 2020 వరకు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వున్న 62 మండలాలల్లో 77,376 సంఘాలకు గాను, 8,01,663 మంది సభ్యులకు 53కోట్ల 43లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్యులు అందించారు. అదే విధంగా మెప్మా పరిధి 15,705 సంఘాలకు 23.43కోట్లు మొత్తం. 76.86 కోట్ల నేరుగా సంఘాల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె.రమేష్, డిఆర్ డి ఏ పిడి హరినాధ్ , మెప్మా పిడి నాగనరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు