'జగనన్న విద్యాదీవెన' ప్రారంభించిన సీఎం జగన్
ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.
జగనన్న విద్యా దీవెన పథకాన్ని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్..
ఏపీలో మరో పథకం ప్రారంభం అయింది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువాలన్న లక్ష్యంతో ఈ పథకం ప్రవేశ పెడుతున్నారు.కరోనా కష్టాలు ఉన్నా విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం 4వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1 వేయి 880 కోట్ల బకాయిల చెల్లింపును కూడా విడుదల చేశారు. ఈ పథకం 12లక్షల మంది తల్లుల ద్వారా వారి పిల్లలకు లబ్ధి చేకూరనుంది.
akshara LEADER Telugu Daily....Editor Jaya....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి