మంత్రి కన్నబాబు ;; సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు ఈ సంవత్సరం జనవరి నెలలో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబందించి 54 .54 కోట్లపంట నష్టం విడుదల

తూ. గో ;;గత  సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు ఈ సంవత్సరం జనవరి నెలలో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబందించి 54 .54 కోట్ల రూపాయలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రస్తుత క్లిష్ట పరిస్తితుల్లో కూడా గౌరవ ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు రైతుల శ్రేయస్సు ను దృష్టిలో వుంచుకొని పంట నష్ట పరిహారాన్ని రిలీజ్ చెయ్యడం జరిగింది అని అన్నారు. ప్రస్తుతము ఈ డబ్బు లబ్దిదారుల ఖాతా ల లోనికి జమ అవ్వడం మొదలైనదని అన్నారు. రాష్ట్రము లో 67,865 మంది రైతుల ఖాతా ల లోనికి పంట నష్ట పరిహారం సొమ్ము జమ అవుతుందని అన్నారు. దీనిలో వరి పంట, ప్రత్తి పంటల కు హెక్టారుకు 15,000రూపాయలు, మొక్క జొన్న పంటకు హెక్టారుకు 12,500 రూపాయలు మరియు అపరాలు కు హెక్టారుకు 10,000 రుఅపయాల చొప్పున రైతుల ఎకౌంటు ల లో జమచేయ్యడం జరుగింది. తూర్పు గోదావరి జిల్లాలో వరి, ప్రత్తి మరియు అపరాల పంటలకు చెందిన 16,565 మంది రైతులకు 10.48 కోట్ల రూపాయలు జమ చెయ్యడం జరిగిందని మంత్రి వర్యులు తెలియజెయ్యడం జరిగింది. ఆలాగే ప్రస్తుతము జిల్లాలో కురిసిన అధిక వర్షాల మూలంగా 16 మండలాల్లో 1,899 హెకరాల విస్తీర్ణం లో వరి పంట దెబ్బతిన్నదని, మొక్క జొన్న 24 హెక్టార్లలో, నువ్వులు 8 హెక్టార్లలో దెబ్బ తినడం జరిగిందని అన్నారు. ఈ పంట నష్టాలను అంచనా వేసి, సదరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు...


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు