ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణి యోజన కింద రూ. 500 లు
తూ .గో ;,ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణి యోజన కింద రూ. 500 లు జమ కరోన నేపధ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణి యోజన కింద రూ.500 లు జమ చేయనున్నారని లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పియం జన్ ధన్ ఖాతాలున్న మహిళలకే నగదు జమ అవుతుందని నగదు తీసుకునే తేదీ ఏప్రియల్ 3, 4,7,8,9 తేదీలలో బ్యాంకులకు వెళ్లి వాటిని తీసుకోవాలని, ఖాతాల చివరినున్న సంఖ్యలు 3వ తేదీన 0,1 మరియు 4వ తేదీన 2,3 మరియు 7వ తేదీన 4,5 మరియు 8వ తేదీన 6,7 మరియు 9వ తేదీన 8,9 సంఖ్యల మేరకు ఖాతాదారుల నగదు తీసుకొనిన తేదీలను ముందుగానే నిర్ణయించారని గురువారం ఎల్ డియం తెలిపారు. ప్రతి ఒక్కరు వారి ఖాతాల చివరినున్న సంఖ్యలకు అనుగుణంగా సూచించిన తేదీలల్లోనే బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10గంటల నుంచి సాయం 4గంటల వరకు బ్యాంకులు పని చేస్తాయని ఎల్ డియం జె.షణ్ముఖరావు ఆ ప్రకటనలో తెలిపారు. ( సమాచార శాఖచే జారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి