టిడిపి;పేదలకు ఆర్థిక సహాయం రూ.5వేలు ఇవ్వాలి;మాజీ ఎమ్మెల్యే దాట్ల దీక్ష

తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం :రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఐ.పోలవరం మండలం మురమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  ముమ్మిడివరం మాజీ  శాసనసభ్యులు తెలుగుదేశం నాయుకులు దాట్ల సుబ్బరాజు ఈరోజు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 9గంటల వరకు  నిరాహార దీక్ష చేపట్టనున్నారు .ఈ సందర్బంగా  అయన మాట్లాడుతూ  కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరు ఆర్ధికంగా  ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారని వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయిలు ఆర్ధిక సహాయం ప్రకటించాలని కోరారు. ఆలాగే మూసేసిన అన్న క్యాంటీన్ లను తెరవాలని, చంద్రన్న భీమా పధకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం,  ప్రత్తి, మిర్చి, పండ్ల తోట ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగులు చెయ్యాలని.... 
సేరి కల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు.  ఆలాగే కనపడని కొరోనాపై ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులకు మరియు ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందిచాలని కోరారు. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరుపున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, నడింపల్లి సుబ్బరాజు, పేరాబత్తుల రాజశేఖర్, సాగిరాజు సూరిబాబురాజు, టేకుమూడి లక్ష్మణరావు, గోలకోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, దాట్ల పృథ్వి, ధూళిపూడి వెంకటరమణ (బాబీ ) తదితరులు పాల్గోన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు