నేటి నుండి రేషన్ ;5 కేజీల బియ్యం,5కేజీల సెనగలు .. ఉదయం 5.30 కె సిబ్బంది హాజరు
తూ.గో ;;కోవిడ్-19 దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కేజీల బియ్యం ,ఒక కేజీ సెనగలు గురువారం ఉదయం నుండి పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తో కలిసి రేషన్ పంపిణీ పై క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే మూడు నెలల పాటు రేషన్ పంపిణీ కొనసాగుతుందని అధికారులు కావలసిన ఏర్పాట్లు సజావుగా చేపట్టాలన్నారు.అవసరమైతే అన్ని శాఖల సహకారం తీసుకుని జిల్లాలో ఒక వినూత్న రీతిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తో పాటు పోలీసుల సహకారం తీసుకోవాలని లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రేషన్ పంపిణీ చేయాలని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ దృశ్య జిల్లాలో దగ్గు, జలుబు, జ్వరం తో కూడిన వారు వివిధ మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్న మందుల వివరాలను రోజువారీగా నివేదికలు డ్రగ్ ఇన్స్పెక్టర్ అందించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మిస మాట్లాడుతూ జిల్లాలో 2471 రేషన్ కార్డులు రేషన్ షాపులు ఉన్నాయని వీటిని 4,500 షాపులు గా విభజించి లబ్ధిదారులకు అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ప్రతి ఉదయం 5. 30 నిమిషాలకు తెరవాలని ఈపాస్ నమోదుకు నియమించిన సిబ్బంది తప్పనిసరిగా ఉదయం. 5 30 నిమిషాలకు హాజరుకావాలని జేసీ ఆదేశించారు. వీటికీ కావలసిన ఏర్పాట్లు తోపాటు మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అందించడం జరిగిందన్నారు. ప్రతి చౌక ధరల దుకాణం వద్ద సబ్బు తో పాటు నీళ్లు పెట్టాలని చేతులు శుభ్రంగా కడుక్కుని ఏర్పాటు ఉండాలని భౌతిక దూరం పాటించే విధంగా మార్కింగ్ చేయాలన్నారు. గంటకు 20 మంది చొప్పున సరుకులు పంపిణీ జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రెడ్ జూన్లో ఉన్న వారికి నేరుగా వాలంటీర్ల ద్వారా సరుకులు అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మి స తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి