;జిల్లాలో 43 మొబైల్ రైతుబజార్ల;;రైతాంగానికి ఆక్వా ప్రోసెసింగ్ యూనిట్లు

తూ .గో  ;జిల్లాలో 43 మొబైల్ రైతుబజార్ల వాహనాల ద్వారా ప్రజలకు కావలసిన కూరగాయలు అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గురువారం మంత్రి కన్నబాబు రమణ్యయ పేట లోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద మొబైల్ రైతు బజార్ వాహానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్-19 ప్రభావం కారణంగా నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయలకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 43 మొబైల్ వాహనాల ద్వారా రైతు బజార్ల నుండి నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటు వుండే ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా 331 మొబైల్ తోపుడు బండ్ల ద్వారా కూడా కూరగాయలు ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే రైతాంగాన్ని నుండి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసే విధంగా ఆక్వా ప్రోససింగ్ యూనిట్లకు అదేశిస్తున్నట్లు వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గురువారం మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ మండలంతో పాటు కరప మండలంలో వున్న ఆక్వా ప్రోససింగ్ యూనిట్లు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తులు తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తి చేతికొచ్చే సమాయానికి కరోనా ఉపద్రువం వచ్చిందని, తమ ఉత్పత్తులు కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లామని, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తక్షణం స్పందించి ఆక్వా ప్రోససింగ్ యూనిట్లు, ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారన్నారు.


ఇప్పటికే ఆక్వా యూనిట్లకు ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా స్వయంగా మంత్రి, జిల్లా కలక్టర్ ఆక్వాప్రోససింగ్ యూనిట్లను సందర్శించి ఈ యూనిట్లు తెరచి పనులు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యూనిట్లు ప్రోససింగ్ చేయడానికి కార్మికుల సమస్య లేదని కార్మిక శాఖ ద్వారా కార్మికులను పంపియున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఆక్వా కేంద్రం వద్ద ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్వా ప్రోససింగ్ కేంద్రం వద్ద పారిశుద్ధ్యంతో పాటు భౌతిక దూరం పాటించాలని, కార్మికులకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించాలని మంత్రి ప్రోససింగ్ యూనిట్ల యాజమానులకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకినాడ రూరల్ మండలంలోని పలసపాడు లోని దేవి ఫిషరీస్, కరప మండల పాశాలగుంటలో కోస్టల్ ఆక్వా ఫిషరీస్ యూనిట్లను సందర్శించి ఆయా సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేసారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు