
ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది చిన్న పిల్లలు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఏపీలో నమోదైన కేసుల్లో 40 మంది మూడు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు వయసు వారు ఉన్నారు. అయితే, వారంతా ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కుటుంబసభ్యులే కావడం గమనార్హం. కరోనా బారిన పడిన చిన్నారుల కుటుంబాల్లో ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. 40 మంది చిన్నారులతో పాటు కరోనా బారిన పడిన 124 మంది మహిళల కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. తబ్లిగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల వైరస్ సోకిన వారిలో 60 సంవత్సరాలకు పైబడిన వారు 36 మంది ఉన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి నెలల చిన్నారుల నుంచి 12 సంవత్సరాలలోపు 20 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 534 మంది కరోనా బాధితులు ఉన్నారు. అందులో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో 700 మంది కరోనా బాధితులు ఉన్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి