నవరత్నాలు -పేదలకు ఇల్లు ;;కేంద్రం 3 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
తూ.గో ;నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి 3 లక్షల ఇళ్లకు అనుమతులు రావడం జరిగిందని కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి తెలిపారు.
బుధవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మీశ తో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఇప్ప టికే గుర్తించిన లేఅవుట్ పక్రియను పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన చేపట్టాలని అన్నారు. సేకరించిన భూమిలో లేఅవుట్ కు కావలసిన గ్రావెల్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. చేసిన ఖర్చు త్వరితగతిన బిల్లులు సమర్పిస్తే,మరిన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయి అన్నారు. గుర్తించిన లేఅవుట్ ప్రాంతాలను ఎస్ ఈ ట్రాన్స్కో అందిస్తే తగిన విధంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కు కావలసిన ప్రతిపాదనలు వస్తాయన్నారు. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతం పనులు లేనందున పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు నిర్మించడానికి 12 వేల కోట్ల రూపాయలు ఒక కృష్ణా జిల్లాలోనే ఖర్చు పెట్టే అవకాశం ఉన్నందున డివిజన్ స్థాయి అధికారులు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ గృహ నిర్మాణాలు జరిగే విధంగా పని చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్. జి లక్ష్మిశ మాట్లాడుతూ గుర్తించిన స్థలాల్లో నరేగా నుండి పనులు జరిగే విధంగా మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలి అన్నారు .ఇంకా లేఅవుట్ పూర్తి చేయని మండలాలు లేఅవుట్ పక్రియను పూర్తి చేయాలని జెసి లక్ష్మీ షా తెలిపారు. పిడి డ్వామా శ్యామల మాట్లాడుతూ ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో భూమి చదును కు కావాల్సిన అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
(
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి