జిల్లాలో తొలి కరోనా పాజిటీవ్ కేసు చికిత్స అనంతరం డిశ్చార్జ్ - కరోనా అంటే భయపడనక్కరలేదు అవగాహన ముఖ్యం. - సామాజిక మాద్యమాల్లో వస్తున్న వధంతులు ఊహాగాహనలు నమ్మవద్దు - ఢిల్లీ నుండి వచ్చిన వారందరిని గుర్తించడం జరిగింది. - వ్యవసాయం, ఆక్వా, నిత్యావసర వస్తువులకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు -- కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి జిల్లా యంత్రంగాన్ని వైద్య బృందాన్ని ప్రసంశించిన ఎమ్.పి గీత, ఎమ్ఎ చంద్రశేఖర్ రెడ్డిలు

తూ .గో ;; జిల్లాలో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదు అయిన యువకునికి అన్ని చికిత్సలు అనంతరం నెగిటీవ్ గా డాక్టర్ల బృందం ప్రకటించిన నేపద్యంలో ఆ యువకుని డిశ్చార్జ్ చేసినట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన యువకునికి డిశ్చార్జ్ చేసే కార్యక్రమంలో కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్.పి అద్నాన్ నయీం అస్మీ, ఎమ్.పి వంగగీత, ఎమ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంటు ఎమ్.రాఘవేంద్రరావు వైద్యబృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల లండన్ లో వుంటూ స్వస్థలం రాజమహేంద్రవరం వచ్చిన యువకునికి వైద్య పరీక్షలు చేయించగా కరోనా పాజిటీవ్ వచ్చినందున కాకినాడ జీజీహెచ్ కరోనా ఐసోలేషన్ వార్డలో చికిత్సలు అందించడం జరిగిందన్నారు. కాకినాడ జీజీహెచ్ లోని సూపరింటెండెంట్ ఎమ్.రాఘవేంద్రరావు నేపధ్యంలోని వైద్య బృందం ఆ యువకునికి ప్రత్యేక చికిత్సలు అందించి, రెండు సార్లు కరోనా పరీక్షలు చేసి కరోనా వైరస్ లేదని నిర్ధారించిన తర్వాత శుక్రవారం డిశ్చార్ట్ చేయడం జరిగిందని కలక్టరు తెలిపారు. చాలామంది కరోనా గురించి లేనిపోని అపోహాలు కల్పిస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వైరస్ పట్ల పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. వ్యక్తిగత దూరం పాటించడంతో పాటు రోజుకు చేతులు శుభ్రం చేసుకోవడం, మంచినీళ్ల తరచుగా త్రాగడం, ఇంటి వద్దనే వుండడం లాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి ప్రభలదన్నారు. సామాజిక మాద్యమాల్లో కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు, ఊహాగానాలు నమ్మవద్దని ప్రజానికానికి కలక్టర్ విజ్ఞప్తి చేసారు. కరోనా ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో పూర్తి గా పారిశుద్ధ్య పనులతో పాటు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని కలక్టర్ తెలిపారు. జిల్లా నుండి ఢిల్లీకి వెళ్లినవారు 36 మంది వున్నారని, వీరిలో ఇద్దరు ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు వున్నారని, 34 మంది జిల్లాకు చేరుకున్నారన్నారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాటి టీవ్ కేసులుగా గుర్తించి కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. మిగిలిన వారిని వారి కుటుంబ సభ్యులకు 200 మందికి సాంపిల్స్ సేకరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు జిల్లా యంత్రాంగానికి సహకరిసున్నారని, ఎవరికైన ఏ ఒక్క సమస్యలు వుంటే కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చని కలక్టర్ సూచించారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు, వ్యవసాయ పనులు, నిత్యవసర సరుకులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఎస్.పి అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ జిల్లా అంతటా లాక్ డౌన్ సజావుగా అమలు జరుగుతుందని సోషల్ మీడియా వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని సెక్షన్-188 ప్రకారం 458 మంది కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి వివిధ మార్గాల ద్వారా నిబందనలు అతిక్రమించినవారి పై ఇప్పటికే పదివేల కేసులు నమోదు చేసి 50 లక్షలు జరిమానాలు విధించినట్లు ఎస్.పి తెలిపారు. పార్లమెంట్ సభ్యులు వంగ గీత, శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులతో జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య బృందాలు, పారిశుద్ధ్యం కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఇదే సమయంలో సామాన్య ప్రజానికానికి నిత్యావసర సరకులు కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆక్వా, వ్యవసాయం రంగంలో ఎటువంటి సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేస్తూ 24 గంటలు అప్రమత్తంతో పనిచేస్తున్న ప్రతి అధికారికి ఎమ్.పి, ఎమ్ఎ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్.రాఘవేంద్ర మాట్లాడుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తున్న విధానాన్ని మీడియాకు వివరించారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు