మొక్కజొన్న మరియు జొన్నలు కొనుగోలు కేంద్రాలు

తూ.గో ;;జిల్లాలో ఎపి మార్క్ ఫెడ్ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్న మరియు జొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఎపి మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ ఐ.మంజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపి మార్క్ ఫెడ్ శాఖ ద్వారా రైతులకు మద్దతు ధరకే మొక్కజొన్న మరియు జోన్నలు లభించునని ఎపి మార్క్ ఫెడ్ పిఏ సియస్ సోసైటీ నందు కొనుగోలు జరుగుతుందని జిల్లా మేనేజర్ ఐ.మంజు ఆ ప్రకటనలో తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు చిన్న కొండేపూడి పిఏ సియస్, వంగలపూడి పిఏ సియస్, రాపాక పిఏ సియస్, గోకవరం పిఏ సియస్, కోరుకొండ పిఏ సియస్, తొర్రెడు పిఏ సియస్, వడ్డి పర్రు పిఏ సియస్, ఇందుకూరు పేట పిఏ సియస్, కామరాజు పిఏ సియస్, వానపల్లి పిఏ సియస్, జె.రంగం పేట పిఏ సియస్ కేంద్రాల వద్ద ప్రతి క్వింటాకు మొక్కజొన్న రూ. 1760 లు కొనుగోలు చేయుట జరుగుతుందన్నారు. అదే విధంగా జొన్నలు కొనుగోలు కేంద్రం రాపాక పిఏ సియస్ నందు మాత్రమే కొనుగోలు చేయబడునని తెలిపారు. జోన్నలు ప్రతి క్వింటాకు హైబ్రిడ్ ధర రూ. 2550 లు, సామాన్య ధర రూ. 2570 లు మద్దతు ధరకే కొనుగోలు చేయబడునని, అదే విధంగా శెనగలు కొనుగోలు కేంద్రాలు రంగం పేట పిఏ సియస్, బూరిగపూడి పిఏ సియస్, జెడ్.రాగం పేట పిఏ సియస్, రఘదేవపురం పిఏ సియస్ కేంద్రాల వద్ద శెనగలు ప్రతి క్వింటా కనీస మద్దతుధర రూ.4,875 లకు కొనుగోలు చేయబడునని తెలిపారు


......................................................................................


 


 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు