రైతులకు గిట్టు బాటు ధర
ధాన్యం పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు.... --- కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు.... --- ధాన్యం మద్దతు ధర తెలియజేసే విధంగా గ్రామ వ్యవసాయ సహాయకులు అవగాహన కల్పన....... --- వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి.... --- వినూత్న రీతిలో కూరగాయలు, పండ్లు రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు...... జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి శ. తూగో ;;
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని ,వీటిని అవగాహన కల్పించవలసిన బాధ్యత క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఉందని జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి శ పేర్కొన్నారు. శనివారం జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ వ్యవసాయ , ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఇందులో భాగంగా గ్రామ సచివాలయంలో వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నాలుగు లక్షల 50 వేల మంది రైతులు ఉన్నారని వీరిలో 400 నుండి 450 మంది రైతులకు ఒక వ్యవసాయ అధికారి ఉన్నారన్నారు. ధాన్యం పండించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా రైతులకు విశిష్ట స్థానం ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పంట పండించే రైతుకు అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అవగాహన కల్పించి, ఒక్క రైతు కూడా ఆర్థికంగా నష్టపోకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందన్నారు. జిల్లా వ్యవసాయాధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తుండలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయని అవసరమైతే వీటి సంఖ్యను పెంచి ఏ రైతు తాను పండించిన పంట తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అన్నారు. ఎవరైనా దళారులు ధాన్యం నాణ్యత లేదని కారణం చూపి తక్కువ ధరకు కొనుగోలు చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు తెలియజేసేలా గ్రామం వ్యవసాయ సహాయకులు పని చేయాలన్నారు. గిట్టుబాటు ధరల పై ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే తెలుసుకునే వ్యవస్థ ఉందన్నారు. రైతులకు నష్టం జరిగే ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత సిబ్బంది పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బ్రోకర్లు, రైస్ మిల్లులపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం రైతు పొలం దగ్గరే ధాన్యం కొనుగోలు చేసే విధంగా నిర్ణయించి నందున సగటు నాణ్యత ఉండేవిధంగా క్షేత్రస్థాయి సిబ్బంది రైతు కష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో రైతు బజార్ల సంఖ్యను పెంచి రైతు పండించిన కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసి నేరుగా అమ్మకాలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ల జి లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి