. 23న బ్లాక్ డే!...కేంద్రానికి డాక్టర్ల అల్టీమేటం
దేశవ్యాప్తంగా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రోగి తరపు బంధువులు దాడులు చేయడం పరిపాటిగా మారింది. దీనిపై తాజాగా కేంద్రానికి ఐఎంఏ అల్టీమేటం జారీ చేసింది.
మరోవైపు తమ డాక్టర్లపై జరుగుతున్న దాడులపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకుని, కఠిన చట్టాన్ని తేవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. లేకపోతే ఈనెల 23న బ్లాక్‌డేగా పాటిస్తామని తెలిపింది. మరోవైపు ఈ దాడుల అంశాన్ని కేంద్రం కూడా సీరియస్‌గానే ఉంది. వీటిని కట్టడి చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు డాక్టర్లపై దాడులు, లాక్‌డౌన్ ఉల్లంఘనలు, సోషల్ డిస్టెన్స్‌పై దృష్టి సారించేందుకుగాను కేంద్రం ఇప్పటికే ఆరు ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి