లాక్ డౌన్ ;; 20 రోజులుగా దోమన అలుపెరుగని సేవలు

విశాఖపట్నం ;lమహా విశాఖపట్నం జివిఎంసి మల్కాపురం పరిధి 62వవార్డు 17 .4.2020   (20వ రోజూ)   గురువారం మధ్యాహ్నం 12.30 గంటల నుండి అంబేద్కర్ కాలనీ ప్రకాష్ నగర్లో ఉన్న  పేదలకు  అనాధులకు  వాలంటీర్లకు  200 మందికి పెరుగు అన్నం ప్యాకెట్లు  చిన్నారావువెల్ఫేర్ సోసైటి ఆధ్వర్యంలో దోమన చిన్న రావు సొంత ఆర్థిక నిధులతో వితరణ చేయడం జరిగింది .సేవా ట్రస్టు అధినేత దోమన చిన్నారావు గారు మాట్లాడుతూ  ప్రపంచ మహమ్మారి కరొనా వైరస్ వల్ల  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు లాక్ డౌన్   చేయడం వల్ల దినసరి కూలీలకు వలస కార్మికులకు అనాధులకు అభాగ్యులకు 20 రోజుల నుండి అలుపెరగని ప్రజాసేవలో ఉన్నామని నాలుగేళ్లుగా చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యములు కంటిన్యూగా చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఈపు సోమునాయుడు కెల్ల జగన్ నిడిగట్ల రాము కురిటి మురళీ కాకి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు