సజావుగా 2వ దఫా రేషన్ ;జెసి లక్ష్మీశ
తూ.గో ;;జిల్లాలో రెండవ దఫా రేషన్ పంపిణీ సజావుగా జరిగిందని జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం ఉదయం పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ సచివాలయం నుండి జిల్లా జాయింట్ కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలక్టర్ మాట్లాడుతూ జిల్లా లో రెండవ దఫా బియ్యం, శనగలు పంపిణీ సజావుగా జరిగిందని, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం సంబంధిత విభాగాలు పర్యవేక్షించి లబ్ధిదారులు ఎటువంటి ఆటంకం లేకుండా సరకులు పంపిణీ జరిగిందన్నారు. కోవిడ్-19 ప్రభావం కారణంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రేషన్ షాపు దగ్గర తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6గంటలకు షాపులు తెరవడం జరిగిందన్నారు. జిల్లాలో 32 షాపులు నిర్దేశించిన సమయం కంటే ఆలస్యయంగా 8.30 నిషాలకు తెరవడం జరిగిందని, వీరిని గుర్తించి షోకేజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే షాపుల రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి