కరవిజృంభణ ;ఇండియాలో 2వేలు దాటిన కరోనా కేసులు.. 53 మరణాలు

                                                                      మహారాష్ట్రలో ఇవాళ 82 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 416కు చేరింది. ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 293కి చేరింది. వీరిలో 183 మంది తబ్లీఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారే ఉన్నారు.



                                                                                                     భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు వందకుపైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా సోకడంతో మనదేశంలో కోవిడ్-19 సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల మార్క్‌ను దాటింది. గురువారం సాయంత్రం నాటికి దేశంలో 2,069 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 156 మంది పేషెంట్లు కోలుకొని డిశ్చార్జి కాగా.. 53 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,860 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు పెరగడంతో రేపు, ఎల్లుండి మరిన్ని కేసులు బయటపడే అవకాశముంది.ఇక మహారాష్ట్రలో ఇవాళ 82 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 416కు చేరింది. ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 293కి చేరింది. వీరిలో 183 మంది తబ్లీఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారే ఉన్నారు. అటు తమిళనాడులో ఇవాళ 75 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 309కి చేరింది. కేరళలో ఇవాళ 21 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 286కి చేరింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు