ఏలూరు రేంజి డీఐజీ కెవి మోహన్ రావు  తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం లో తనిఖీ

తూ .గో ;COVID-19 నివారణ చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ సందర్భంగా ఏలూరు రేంజి డీఐజీ కెవి మోహన్ రావు  తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం పట్టణములోని వివిధ ప్రాంతాలను సందర్శించి, అచ్చట ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 14 వ తేదీ వరకు కరొన  వ్యాధి వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ఎవరు బయటకు రావద్దని, నిర్దేశించిన సమయంలో మాత్రమే నిత్యావసర వస్తువులకు బయటకు రావాలని, ఆ సమయంలో కూడా రెండు మీటర్ల దూరంతో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, దీనిలో భాగంగానే బస్సులు , ట్రైన్ లు తదితర రవాణా సౌకర్యాలను రద్దు చేయడం జరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యవసర వస్తువులు కొనుటకు మరియు అమ్ముటకు సమయం కేటాయించబడిందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ పనులు మరియు వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 1 గంట వరకు వారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పని చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగిందని, అదేవిధంగా ఆక్వా, కోకో ఆయిల్ ఫామ్, ఆక్వా ఫీడ్, ఫ్రూట్స్ మరియు జిటేబుల్స్ ఉత్పత్తులు, రవాణా యధావిధిగా సాగుతాయని, అలాగేఫార్మా  రంగానికి, మెడికల్  ఎమర్జెన్సీ కి కూడా 24 గంటలు అనుమతి ఉంటుందని, వీటిని ఎవరు ఆటంకపరచరని ఈ సందర్భంగా డిఐజి తెలియజేశారు. ఈ సందర్భంగా సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించినట్లు వీటిని ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188, 269, 271 ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇంతవరకు ఏలూరు రేంజ్ పరిధిలో అనవసరముగా రోడ్లపై తిరుగుచూ , నిబందనలు ఉల్లంఘించిన 50 వేలమంది వాహనదారులకు ఎంవి ఆక్ట్ ప్రకారం 1 కోటి 29 లక్షలు జురుమాన విధించినట్లు తెలియజేసారు. అదేవిధముగా ఎవరికైనా కరోనా  లక్షణాలు కనబడితే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఎవరైనా విదేశాలకు గాని, ఢిల్లీ ఇస్తిమా కు గాని వెళ్లి వచ్చినట్లయితే వారు వెంటనే గవర్నమెంట్ మెడికల్ అధికారి వారిచే పరీక్షలు చేయించుకోవాలని అవసరమైతే 14 రోజులు కోరంటైన్ లో ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను ఆపి అత్యవసరం అయితే తప్ప ఇలా బయటకు రాకూడదు అని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మాస్కులు అందజేసినారు. అలాగే అమలాపురం పట్టణంలో పనిచేస్తున్న 30 మంది పోలీస్ సిబ్బందికి, 40 మంది మీడియా వారికి మాస్కులు హ్యాండ్ గ్లాసెస్, ఇతర సామాగ్రితో కూడిన కిట్లను అందజేసినారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో అమలాపురం డి ఎస్పి   ఎస్ కె మాసూం భాష, అమలాపురం పట్టణ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు