నిండు చూలాలికి పోలీస్ చేయూత

ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న ఓ నిండు చూలాలికి సమయానికి సహాయపడి తానూ ఓ తల్లి బిడ్డనేనని ఇలా చేయడంలో ఎంతో తృప్తి చెందానని చాటిచెప్పిన పోలీసు అధికారి మన ప్రత్తిపాడు సబ్ ఇనస్పెక్టర్ ఎస్. రవికుమార్ మరియ వారి టీమ్.


        


                                                                                                                  తూ .గో ;;ప్రతిరోజూలాగానే ఉదయాన్నే తన పోలీసుస్టేషన్ పరిధిలోని మార్కెట్లు, సెంటర్ల లో బందోబస్తు డ్యూటీకి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎస్.ఐ. గారు బయట తిరిగి తిరిగి అల్పాహారం కోసం సుమారు 9.30 గంటలు ప్రాంతంలో ఇంటికి చేరారు. యూనిఫాం విప్పకుండానే ప్రత్తిపాడు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎ.సన్యాసిరావు వద్ద  నుండి తనకు వచ్చిన ఫోన్ కాల్ “ప్రత్తిపాడు నుండి సుమారు 20 కి.మీ. లు దూరంలో గల అటవీప్రాంతం లో గల గిరిజన గ్రామం కిట్టమూరిపేట గ్రామంలో ఒక నిండుగర్భిణ తీవ్రమైన నొప్పులతో బాధ పడుచున్నదని ఆమెకు కాన్పు సమయం దగ్గర పడినదని, అంబులెన్సులు సమయానికి అందుబాటులో లేవని మీ పోలిసువారే ఏదైనా చేస్తే బాగుంటుందని” స్టేట్ కోవిద్ హెల్ప్ లైన్ నుండి కాల్ వచ్చినట్లు గా సమాచారం అందుకున్నారు. వెంటనే అడిషనల్ ఎస్.ఐ. ఎ. సత్యనారాయణ,   హోం గార్డు డ్రైవర్ పి.మధు, మరొక హోం గార్డు N.త్రిమూర్తులు లను తీసుకుని తన పోలీస్ స్టేషన్ జీప్ లో హుటాహుటిన కిట్టమూరిపేట గ్రామానికి వెళ్ళడము జరిగినది. అతను కూడా స్టేట్ కోవిద్ హెల్ప్ లైన్ కు మాట్లాడడం జరిగింది. గ్రామం లో నొప్పులతో బాధపడుచున్న నిండు చూలాలు శ్రీమతి బి.దుర్గను జాగ్రత్త గా తమ జీప్ లో ఎక్కించుకొని ప్రత్తిపాడు తీసుకుని వచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించడం జరిగింది. ఎస్.ఐ. ఎస్. రవికుమార్. మరియు సి.ఐ. శ్రీ ఎ.సన్యాసిరావు  వద్దనుండి సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అప్పటికే సిద్దంగా ఉన్నారు.డాక్టర్స్ ఆమెను పరీక్ష చేసి ఈరోజు రాత్రికి గాని, రేపుగాని కాన్పు కావచ్చునని చెప్పినారు. సమయానికి వెళ్ళిసహాయపడిన ప్రత్తిపాడు ఎస్.ఐ. ఎస్.రవికుమార్, అడిషనల్ ఎస్.ఐ. ఎ. సత్యనారాయణ,   హోంగార్డ్స్ పి.మధు,  N.త్రిమూర్తులు, మరియు ప్రత్తిపాడు  సి.ఐ.  ఎ.సన్యాసిరావు లను ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంతో మెచ్చున్నారు. ఈ సందర్భంగా సి.ఐ., ఎస్.ఐ.లు హోం గార్డ్స్ మాట్లాడుతూ ఇటువంటి సేవ చేయడంతో తమ జన్మ ధన్యమైందని ఉద్వేగంగా అన్నారు. జిల్లా ఎస్.పి.  అద్నాన్ నయిం అస్మి  స్ఫూర్తి తో తాము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నామని వారు అన్నారుఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.  అద్నాన్ నయిం అస్మి,  అడిషనల్ ఎస్.పి.లు  ఆరిఫ్ హఫీజ్,  కె.కుమార్  మరియు ఇతర అధికారులు వారిని అభినందించారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు