కోవిడ్ 19;; కరోనా మహమ్మారి దోష పరిహారార్థం చండీహోమం
తూ.గో ;;ముమ్మిడివరం. ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక సమస్య కరోనా వైరస్ ఈ వైరస్ అన్ని దేశాల్లోనూ అధికంగా వ్యాపించడంతో మన భారతదేశంలో దీని ప్రభావం మిగతా దేశాలతో పోల్చుకుంటే కాస్త ఫర్వాలేదు అన్నట్లుగానే ఉంది ఎందుకనగా మన భారతదేశం కర్మభూమిగా ప్రపంచ దేశాల్లోనూ పేరుగాంచింది మన భారతదేశంలో పూర్వీకులు మనకు చూపించిన ఆధ్యాత్మికతను భారతీయులు అనుసరిస్తున్నారు. అయితే మనవాళ్లు చేశారు మనం వారి పేరు చెప్పుకుని ఉండొచ్చు అనుకోకుండా మనవంతు మనం కూడా దేవతారాధన చేయాలి. ఇందులో భాగంగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి బుధవారంనిట్టల నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ముమ్మిడివరం లో శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి ఆలయము నందు లోకకళ్యాణార్థం, కరోనా మహమ్మారి దోష పరిహారార్ధం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి దోష పరిహారార్ధం బ్రాహ్మణ సంఘం చండీ హోమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ఈ హోమం నిర్వహించడం అయినది అని భారతదేశ హిందూ సంస్కృతి ప్రకారం పూర్వం ఎన్నో వైరస్లు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కనుమరుగు అయ్యాయని అయితే ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని ప్రజలు సురక్షితంగా ఉండాలని హోమం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకొండి కిరణ్ శర్మ, ఆకుండి సాయి శర్మ, భాగవతుల సంతోష్ కుమార్ శర్మ, కాట్రావులపల్లి పవన్ శర్మ, చింతా రాము, పోలేటి గణేష్ శర్మ, పుల్లెల రామలింగ శర్మ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి