కోవిడ్-19 లాక్ డౌన్;; అధికారులు ,సిబ్బంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
తూ .గో ;;కోవిడ్-19 లాక్ డౌన్ లో భాగంగా ప్రజలందరూ ఇంట్లో ఉన్నప్పటికీ దీని నివారణకు నిరంతరం శ్రమిస్తున్న అధికారులు సిబ్బంది తమ తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మిశ తో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో కోవిడ్-19 పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోవిడ్-19 పై చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడుతూ ఈ వైరస్ నివారణ కోసం పని చేస్తున్న వారికి పాజిటివ్ వస్తున్న సంఘటనలు ఇతర జిల్లాల్లో వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా అధికారులు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, 17వ తేదీ నుండి రోజుకు వెయ్యి మంది శాంపిల్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వైద్యులు, పోలీస్, మున్సిపల్ ,రెవిన్యూ సంబంధిత శాఖల అధికారులు పరీక్ష చేయించుకోవాలి అన్నారు. ఈ పరీక్షలు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం చేయించుకోవాలని సూచించారు. 17వ తేదీ కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయం లోనూ, మున్సిపల్ ఆఫీసు, కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ పరీక్ష చేయడం జరుగుతుందన్నారు.18వ తేదీన కాకినాడ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలానికి 50 శాంపిల్స్ తీయటం జరుగుతుందన్నారు. దశలవారీగా జిల్లాలోని అన్ని డివిజన్, మండలాల్లో శాంపిల్స్ తీసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రచించడం జరిగింది అని కలెక్టర్ తెలిపారు. ఇతర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లి అక్కడ ఉండి వారి వారి ప్రాంతాలకు వస్తున్న వారందరినీ అధికారులు తగిన విధంగా గుర్తించాలి అన్నారు. ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేని వారికి తమ తమ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండే విధంగా పంపాలన్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే క్వారంటైన్ సెంటర్ కు పంపాలని, ఇంటి వద్దనే ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉంటాం అని తెలియజేస్తే వారిని వారి ఇళ్లకు పంపవచ్చునని కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెసి2 జి.రాజకుమారి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేయించుకోవాలి అన్నది స్పష్టమైన ఆదేశాలు తో పాటు ఎక్కడ చేస్తారు అనేది స్పష్టంగా తెలియ చేయడం జరిగిందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులకు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి