కోవిడ్-19 ప్రభావం;;మొబైల్ వాహనం ద్వారా వందరూపాయలకే నాలుగు రకాల పండ్లు ప్యాకెట్
తూగో ;;కోవిడ్-19 ప్రభావం కారణంగా సామాన్య ప్రజానీకానికి బలవర్థకమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో మొబైల్ వాహనం ద్వారా వందరూపాయలకే నాలుగు రకాల పండ్లు ప్యాకెట్ అందించే కార్యక్రమం చేపట్టినట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఆనందభారతి గ్రౌండ్ నుండి జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి కోవిడ్-19 ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, ఎమ్ఎన్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో రోగ నివారణ శక్తి వుంటుందని, ఈ శక్తిని అందించడానికి విటమిన్లు గల పండ్లు తినడం ఎంతైన అవసరం వుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు అందుబాటలో వుండే విధంగా వందరూపాయలకే నాలుగు రకాల పండ్లు అందించడం జరుగుతుందన్నారు. వీటిలో పుచ్చకాయ ఒకటి, మామిడి పండ్లు నాలుగు, దానిమ్మకాయలు డజన్, అరటి పండ్లు అరడజన్ గల ఒక ప్యాకెట్ గా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు. కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రజానీకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందన్నారు. శరీరంలో శక్తిని పెంచడానికి పండ్లు ఎంతో అవసరమని, ఈ అవసరాలను తీర్చడానికి మొబైల్ వాహనాల ద్వారా వందరూపాయలకే నాలుగు రకాల పండ్లు అందించే విధంగా కాకినాడ నగరంలో ప్రయోగత్మ పూర్వకం ప్రారంభించినారని తెలిపారు. జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి విడమిన్ సి పెంచే ఉసరిని అందించాలనే సూచనలు చేశారని, వీటిని కూడా ఈ ప్యాకెట్ తో అందించే విధంగా ఉధ్యానవనశాఖ ద్వారా ఏర్పాట్లు చేయనున్నట్లు శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ కోవిడ్-19 నివారణకు రాష్ట్ర ప్రభుత్వం డా.వై.యస్.ఆర్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దీనిని జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారు వినియోగించుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 14410 పనిచేస్తుందని, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సా.6గంటల వరకు వైద్యుల ద్వారా ఆరోగ్య సేవలు అందుతాయన్నారు. వీటి ద్వారా మూడు దశలలో సేవలు అందుబాటులో వుంటాయన్నారు. ఓ.పి సేవలు, మందుల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. రోగ లక్షణాలను బట్టి కరోనా కేసులను గుర్తించడం, పరీక్షించడం, ఐసోలెట్ చేయడం, క్వారంటైన్ కు పంపించడం చేస్తారన్నారు. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేస్తే వయస్స, రోగ లక్షణాలు నమోదు చేసుకొని వైద్యులు పరిశీలించి రోగి, ఆరోగ్య స్థితిని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు చేస్తారన్నారు. అనంతరం ఎస్ఎమ్ఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయని, అవసరమైన మందులను సూచిస్తూ మందుల చీటిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపడం జరుగుతుందన్నారు. మందుల చీటి వివరాలను బట్టి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఎఎన్ఎమ్, ఆశా కార్యకర్త, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నేరుగా రోగి ఇంటివద్ద కే మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరు సద్వినియోగం చేసుకుని కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా జెసి లక్ష్మీశ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ కె.రమేష్, ఉద్యానవన, మార్కెటింగ్, మెప్మా అధి కారులు, తదితరులు పాల్గొన్నారు. మెప్మా ద్వారా తయారు చేసిన మాస్కలను కలక్టర్, కోవిడ్-19 ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే, ఎమ్ఎస్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ జోన్ లో వుండే వారికి పంపిణీకి కావలసిన కిట్లు అందించారు. అదే విధంగా పలువురు వినియోగదారులు వందరూపాయలకు నాలుగు రకాల పండ్లు కిట్లు కొనుగోలు చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి