కరోనా (కోవిడ్ 19)పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు;ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్ర హెచ్చరికలు
కరోనా (కోవిడ్ 19)పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడులో ఏపీ- తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టు వద్ద లాక్‌డౌన్ పరిస్థితులు, భద్రతను డీజీపీ పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, నాగార్జునసాగర్, విజయనగరం జిల్లా సాలూరు, ఇతర చెక్‌పోస్టుల సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైనా వర్గాన్ని గాని లేదా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొనడం ద్వారా ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఏపీ నుంచి 1,085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిందని, కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. మర్కజ్‌లో పాల్గొన్న వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి