కాకినాడ కోవిద్ 19; నేటి విరాళాల వివరాలు
సామర్లకోట అంబటి సుబ్బన్న ఆయిల్ కంపెనీ వారు కరోన నియంత్రణలో భాగంగా సియం రిలీఫ్ ఫండ్ క్రింద రెండు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి కి సంస్ధ నిర్వాహకులు సింగవరపు సాయిబాబు, తులసీధర్ రావు అందజేశారు.
కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు కోవిడ్-19 నియంత్రణలో భాగంగా కాకినాడ సిటీ ఎంఎల్ఏ డి.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఒక లక్ష రూపాయల చెక్కును జాయింట్ కలక్టర్ లక్ష్మిశకు అందజేశారు.
కాకినాడ హోల్ సేల్ వెజిటబుల్ అసోసియేషన్ వారు కోవిడ్-19 నియంత్రణలో భాగంగా కాకినాడ సిటీ ఎంఎల్ఏ డి.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో రెండు లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలక్టర్ జి.లక్ష్మిశకు అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి