బ్రహ్మ్మనందం ;;;17 రోజులు తిండి లేక పోయిన పర్వాలేదు ;;మా నాన్న 18 వ రోజునుండి అడుక్కో అన్నాడు
బ్రహ్మానందం జీవితంలో ఇంత విషాదమా!
18 రోజులు తిండి తినకపోతే చచ్చిపోతారంటారన్నాడు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచవద్దని, 18వ రోజు అడుక్కోరా, లేకపోతే చచ్చిపోతావని తన తండ్రి చెప్పాడని ఆవేదనతో బ్రహ్మానందం తెలిపాడు. అందుకే ప్రతి ఒక్కరూ కరోనాపై పోరాటంలో ఓర్పు, సహనంతో ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
అందరినీ నవ్విస్తూ హాస్యబ్రహ్మగా పేరొందిన బ్రహ్మానందం జీవితం వెనక ఇంత విషాదం ఉందా? ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పే వరకూ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించాడు. కరోనాపై విజయం సాధించేందుకు ఓర్పు, సహనం చాలా అవసరమన్నాడు.మహాత్మాగాంధీ ఓర్పుతో ఉన్నారు కాబట్టే స్వాతంత్ర్యం సాధించారన్నాడు. నెల్సన్ మండేలా సహనంతో ఉన్నారు కాబట్టే దక్షిణాప్రికాకు స్వేచ్ఛ వచ్చిందన్నాడు. అంబేద్కర్ గంగానది ఈదుకుంటూ వెళ్లి చదువుకోవడం వల్లే మనదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసే స్థాయికి చేరుకున్నారన్నాడు. ఈ మహానుభావులంతా తమ జీవితాల్లో ఎదురైన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే గొప్ప వారయ్యారన్నాడు.వారే మనందరికీ స్ఫూర్తి అని బ్రహ్మానందం అన్నాడు. అయితే వీరితో తన పేరు కూడా చెప్పుకుంటే బాగుండదన్నాడు. ఆకలి విలువ తనకు బాగా తెలుసునని ఆయన అన్నాడు. తన తండ్రి భోజనం పెట్టే వరకు తమ ఆరుగురు అన్నదమ్ములు ఎదురు చూడటం అంటే ఏంటో తెలుసనన్నాడు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి ఖాళీ కడుపున పడుకున్న విషాద రోజులను ఆయన గుర్తు చేసుకున్నాడు.అలాంటి దుర్భర స్థితి నుంచి వచ్చిన తాను ఎంఏ చదివి, లెక్చరర్ ఉద్యోగంలో చేరి...ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి ఈ స్థితిలో నిలిచినట్టు బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. అందుకే సహనం, ఓర్పు గురించి చెప్పే అర్హత తనకు ఉండటం వల్లే...చెబుతున్నట్టు బ్రహ్మానందం తెలిపాడు. పనికి వెళితేనే పూట గడిచే పరిస్థితిని తాను అనుభవించినట్టు భావోద్వేగం నిండిన స్వరంతో ఆయన చెప్పుకొచ్చాడు.
18 రోజులు తిండి తినకపోతే చచ్చిపోతారంటారన్నాడు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచవద్దని, 18వ రోజు అడుక్కోరా, లేకపోతే చచ్చిపోతావని తన తండ్రి చెప్పాడని ఆవేదనతో బ్రహ్మానందం తెలిపాడు. అందుకే ప్రతి ఒక్కరూ కరోనాపై పోరాటంలో ఓర్పు, సహనంతో ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.మానవ తప్పిదాల వల్లే మనకీ దుస్థితి దాపురించిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఒక మనిషి జీవితంలో కనీస అవసరమైన తిండికి నోచుకోకపోవడం కంటే విషాదం మరొకటి ఉండదు. బ్రహ్మానందం జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొని, తనను తాను ఆదర్శంగా తీర్చిదిద్దుకున్న తీరు...నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి