సిద్ధంగా ఉండండి....ఏప్రిల్ 15 నుంచి రైళ్ల పునరుద్దరణ..రైల్వే శాఖ సన్నాహాలు

                                                                                                              కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజా రవాణాను నిలిపివేయగా.. మార్చి 24 నుంచి అన్ని రైళ్లను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి రైళ్ల పునరుద్దరణ.. సిద్ధంగా ఉండండి: రైల్వే జోన్లకు ఆదేశాలు? దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. కేవలం సరుకు రవాణ రైళ్లు తప్ప ప్రయాణికులు రైళ్లు నిలిచిపోయాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా... ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.                                                                                                                                           రైల్వే భద్రత సిబ్బంది, రన్నింగ్ స్టాఫ్, గార్డ్స్, టీటీఈలు సహా ఇతర అధికారులు ఏప్రిల్ 15 నుంచి విధుల్లో చేరాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి మంత్రుల బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రైల్వే సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా, రైళ్ల షెడ్యూల్, వాటి ఫ్రీక్వెన్సీ తదితర అంశాల గురించి అన్ని జోన్లకు పునరుద్ధరణ ప్రణాళికను రైల్వే శాఖ జారీ చేసింది. రైలు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. రాజధాని, శతాబ్ది, దురంతో సహా దాదాపు 80 శాతం రైళ్లు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు లోకల్ రైళ్లు కూడా నడపనున్నారు. మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను మార్చి 24 నుంచి నిలిపివేశారు. దీంతో మొత్తం 13,523 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు స్టేషన్లకే పరిమితమయ్యాయి.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు