హై అలెర్ట్ : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు – మొత్తం 132…?
" alt="" aria-hidden="true" />
భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. గంట గంట కి రాష్ట్రంలో కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132 కు చేరాయి. కాగా గత బుధవారం రాత్రి నుండి ఇప్పటి వరకు తాజాగా దాదాపుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరో 21 నమోదయ్యాయి. వీటితో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 132 కి చేరుకుందని రాష్ట్ర వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు అప్ ప్రభుత్వం ఒక బులిటెన్ ని విడుదల చేసింది. అయితే వీటిలో ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే ఈ కరోనా కేసులు అధికంగా నమోదవడంతో స్థానిక ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. అంతేకాకుండా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఒక 65 ఏళ్ళ వ్యక్తికి కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా, అతడికి కరొన సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి మర్కాజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి తో పాటే వారి ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని రెడ్ అలెర్ట్ జోన్ గా ప్రకటించి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ నింబంధనలు విధించిన పోలీసులు,అక్కడి స్థానిక ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు.
కాగా రాష్ట్రవైద్యారోగ్య శాఖా వెల్లడించిన కరోనా బాధితుల వివరాలు ఇలాఉన్నాయి…
అనంతపూర్ – 2
చిత్తూర్ – 8
ఈస్ట్ గోదావరి – 9
వెస్ట్ గోదావరి – 14
గుంటూరు – 20
కడప – 15
కృష్ణ – 15
కర్నూల్ – 1
నెల్లూరు – 20
ప్రకాశం – 17
శ్రీకాకుళం – 0
విజయనగరం – 0
విశాఖపట్టణం – 11
" alt="" aria-hidden="true" />
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి