కంటోన్మెంట్ ఏరియాల్లో రూ 100 కె కాయకూరలు ;;అభినందించిన మంత్రి బోస్
తూ .గో ;;కంటైన్మెంట్ ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడకుండా 100 రూపాయలకే వివిధ రకాల కూరగాయల విజిటబుల్ బాస్కెట్ వినియోగదారులు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం చాలా సంతోషకరమని ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పి.విశ్వరూప్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, కాకినాడ నగర యంఎల్ఏ డి.చంద్రశేఖర్ రెడ్డి, జేసి లక్ష్మిశ శుక్రవరం కలక్టర్ కార్యాలయంలో రైతు బజార్ మొబైల్ యూనిట్ లో 100 రూపాయలకే వెజిటబుల్ బాస్కెట్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసి లక్ష్మిశ మాట్లాడుతూ పండ్లు, కూరగాయలు మానవదేహానికి రోగనిరోధక శక్తినిస్తాయన్నారు. ప్రస్తుతం కరోన నియంత్రణలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి 100 రూపాయల కూరగాయలతో పాటు కొత్తిమీర, కర్వేపాకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మెప్మా వారి ఆధ్వర్యంలో 100 రూపాయలకే విజిటబుల్ బాస్కెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఇప్పటి వరకు వెయ్యి వెజిటబుల్ బాస్కెట్ లను ఇవ్వడం జరుగుతోందని, దానిని 10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీని వలన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, పుష్టికరమైన కూరగాయలు ఇంటివద్దనే అందించడం జరుగుతుందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి