100 ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో జేఎన్టీయూ  ఉపకులపతి ప్రో  .ఎం. రామలింగరాజు  జూమ్ వీడియో కాన్ఫరెన్స్

                                                 


తూ.గో ;; కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 3.30గంటలకు జెఎన్‌టియుకె పరిధిలోని అటానమస్ కళాశాలలు, శాశ్వత గుర్తింపు పొందిన కళాశాలలు, ఫార్మశీ మరియు 100 ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో  ఉపకులపతి ప్రొ.ఎం. రామలింగరాజు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా ప్రబలుతున్న దృష్ట్యా వారు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కళాశాలలు విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపునకై ఒత్తిడి చేయవద్దని, ఆన్లైన్ పద్ధతిలో తరగతుల నిర్వహణ, కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఎవరిని తొలగించవద్దని, వేతనాలను పూర్తిగా చెల్లించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ వివరాలు, కరోనా వ్యాధి పట్ల కళాశాలలు అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సిలబస్ ను ఆన్లైన్ తరగతుల ద్వారా 50శాతం పూర్తి చేయడం జరిగిందని, ద్వితీయ, తృతీయ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు సిలబస్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని, కరోనా సందర్భంగా పలు కళాశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా తీసుకోవడంతో వారు తీసుకున్న జాగ్రత్తలను ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు గారికి వివరించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు 97 ఇంజనీరింగ్ మరియు మేనేజ్ మెంట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా కళాశాలలు తీసుకున్న చర్యలపై ఉపకులపతి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రెక్టార్ ప్రొ.జి.వి.ఆర్.ప్రసాదరాజు, రిజిస్ట్రార్ ప్రొ.సిహెచ్.సత్యనారాయణ, ఓఎస్ డి ప్రొ.వి.రవీంద్రనాధ్, డిఏపి ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, డిఇ ప్రొ.ఎల్.సుమలత, ఎఫ్ డిపి డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసులు, డిఏఏ ప్రొ.వి.రవీంద్ర, ఇతర డైరెక్టర్లు, యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొ.బి. బాలకృష్ణ, యుసిఇవి ప్రిన్సిపాల్ ప్రొ.జి.స్వామినాయుడు, యుసిఇఎన్ ప్రిన్సిపాల్ ప్రొ.వి.వి.సుబ్బారావు, ఆయా అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు