ఉద్యాన శాఖ ;;100 రూ. లకే 5 రకాల పండ్ల కిట్ ;మంగళవారం కాకినాడలో ప్రారంభం

                                                                                                                          తూ.గో (కాకినాడ ) ;;కరోనా వైరస్ నేపద్యంలో ప్రజలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు 5 రకాల పండ్లతో కూడిన కిట్లను కేవలం 100 రూపాయలకే అందించే ప్రక్రియను 21వ తేదీ మంగళవారం నుండి జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభిస్తున్నామని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ఎస్.రామమోహన్ తెలియజేశారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డిల సూచనల మేరకు తమ శాఖ ఆధ్వర్యంలో 3కేజీల పుచ్చకాయలు, కేజీ అరటి పళ్లు, అర కేజీ మామిడి పళ్లు, అర కిలో నిమ్మకాయలు, అర కిలో క్యారెట్ లను ఒక కిట్ గా తయారు చేసి మార్కెటింగ్ శాఖ, మెప్మా సిబ్బంది సమన్వయంతో కాకినాడ నగర ప్రజలకు సంచార విక్రయ వాహనాలలో  వారి ఇంటి వద్దకే అందించే కార్యక్రమం  చేపట్టామని ఆయన తెలిపారు.  ఈ పండ్ల కిట్ ల విక్రయాలను ఈ నెల 21 తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రక్కన గల ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభిస్తారని తెలియజేశారు.  కరోనా వైరస్ ను ఎదుర్కోనేందుకు  అవసరమైన రోగనిరోధక శక్తిని ప్రజలు పెంపొందించుకునేందుకు, అలాగే లాక్ డౌన్ నేపద్యంలో పండ్ల సాగు రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌష్టిక పండ్ల కిట్లను సరసమైన తక్కవ ధరకై అందించే నిర్ణయం గైకొందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన ఉప సంచాలకులు ఎస్.రామమోహన్,  సహాయ సంచాలకులు, కాకినాడ (7995086765)  బి.వి.రమణ  నగర ప్రజలను కోరారు.               


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు