జిల్లా పోలీసు యంత్రాంగం సేవాలు  ఋణం తీర్చుకోలేనివి సీపోర్టు ఆధారిటి 10 లక్షలు దవులూరి 5 లక్షలు లారీ ఓనర్స్‌ 5 లక్షలు విరాళాలు


కాకినాడ ప్రతినిధి,తూర్పు గోదావరి జిల్లా పోలీస్‌ కార్యాయంలో కాకినాడ సీ పోర్ట్‌ అధారిటీ వారు కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా విధులను  నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి వాటిని ఎదుర్కొనుటకు కావసిన ఆర్థిక వనరుల  నిమిత్తం రూ.10 క్ష రూపాయ చెక్కును జిల్లా ఎస్‌పి అద్నాన్‌ నయం అస్మికు అందజేసారు . కాకినాడ పట్టణ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దుగ్గన బాబ్ది ఆధ్వర్యంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యుల  వారిచే సమకూర్చబడిన 5 లక్షల రూపాయు చెక్కును ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డి చేతుల  మీదుగా ఎస్పికి అందజేసారు.. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్‌ దవుూరి దొరబాబు 5 లక్షల రూపాయల  చెక్కును ఎస్పీకి అందజేసారు. ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ పోలీసులు  చేస్తున్న విశేషమైన కృషికి వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని దీనిలో భాగంగా తమ వంతు సహకారం అందించాలి అనే భావనతో ఈ రకమైన ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీఅద్నాన్‌ నయం అస్మి మాట్లాడుతూ పోలీసు యొక్క కష్టాన్ని గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా మంచి పరిణామమని అన్నారు.                              ఈ సందర్భంగా లారీ యూనియన్‌ అసోసియేషన్‌ వారికి, ఈ కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డికి, దవుూరి దొరబాబుకు ,కాకినాడ సి పోర్ట్‌ అథారిటీ యాజమాన్యానికి ఎస్పీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు  తెలియజేశారు.అదే విధంగా ట్రస్ట్‌ హాస్పిటల్‌ యాజమాన్యం వారి ఆధర్యంలో 10 లీటర్ల శానిటైజర్‌ బాటిల్స్‌ 500మాస్కులు  సిబ్బందికి పంపిణీ చేయ నిమిత్తం అందజేసారు .                                                                                                                                                      కోవిడ్‌ -19 నివారణ చర్యలో భాగంగా డి.జి.పి వారి కార్యాయం నుండి రాబడిన హ్యాండ్‌ గ్లౌజ్‌ 5000, పీపీఈఎస్‌ - 100సెట్స్‌ , సబ్బులు  - 10,000, మాస్కులు - 10,000 ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయం అస్మి పరిశీలించారు. జిల్లాలోని కరోనా డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అందరికీ, ఆయా సబ్‌ డివిజన్ల వారీగా అందజేయాల ని, ముఖ్యంగా చెక్‌ పోస్ట్‌లు  మరియ కంటైన్మెంట్‌ ఏరియాలో విధులు  నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అందరికీ అందజేయాల ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఓ.ఎస్‌.డి ఆరిఫ్‌ హఫీజ్‌, అడిషనల్‌ ఎస్పీ ( అడ్మిన్‌) కె.కుమార్‌, అడిషనల్‌ ఎస్‌.పి. ఏ.ఆర్‌. ఎస్‌.వి.ప్రభాకర్‌ రావు, ఎస్‌.బి. డి.ఎస్‌.పిలు  ఎం.అంబికా ప్రసాద్‌, ఎస్‌. మురళీ మోహన్‌, డి.ఎస్‌.పి. ఎ.ఆర్‌ ఎస్‌.వి.అప్పారావు, యస్‌.బి. సీఐ.  యస్‌.రాంబాబు మరియు ఆర్‌. ఐ, ఎ.ఆర్‌  పి.ఈశ్వరరావు, ఆర్‌.ఐ హోమ్‌ గార్డ్‌ రవి కిరణ్‌ తదితర అధికారులు  మరియు సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు